Isaiah 40:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని. కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?” ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు. మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు –నేనేమి ప్రకటింతునని మరియొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది.