Isaiah 43:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[16-17] సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురువారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా ఇలా అంటున్నారు: సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు, గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు,