Isaiah 44:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనిషి సగం కట్టెలు మంటలో కాలుస్తాడు. అతడు ఆ కట్టెలతో మాంసం వండుకొని, కడుపు నిండే అంతవరకు ఆ మాంసం తింటాడు. అతడు వెచ్చదనం కోసం ఆ కట్టెలను మంట పెడతాడు. “బాగుంది, ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంట ద్వారా వెలుగు వస్తుంది గనుక ఇప్పుడు నేను చూడగలను” అని అతడు అంటాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదువ సగ ముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తిపొందగా చలి కాచుకొనుచు ఆహా, చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అను కొనుచున్నాడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సగం కట్టెలను నిప్పుతో కాల్చి ఆ కట్టెల మీద తన ఆహారం వండుకుంటాడు. దానిపై అతడు మాంసం వండుకుని తృప్తిగా తింటాడు. అంతేకాదు, అతడు చలి కాచుకుంటూ, “ఆహా! నాకు వెచ్చగా ఉంది; నాకు మంట కనబడుతుంది” అని అనుకుంటాడు.