Isaiah 44:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఒక వ్యక్తి అంటాడు, ‘నేను యెహోవాకు చెందినవాడను’ అని, మరోవ్యక్తి ‘యాకోబు’ పేరు చెప్పుకొంటాడు. ఇంకొక వ్యక్తి ‘నేను యెహోవావాడను,’ అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు ‘ఇశ్రాయేలు’ పేరు ప్రయోగిస్తాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు–నేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.