Isaiah 45:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవాయే దేవుడు. ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు. భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు. యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు. భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు. యెహోవా చెబుతున్నాడు: “నేనే యెహోవాను. నేను తప్ప ఇంకో దేవుడు లేడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా— యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా చెప్పే మాట ఇదే: ఆకాశాలను సృష్టించిన యెహోవాయే దేవుడు. ఆయన భూమికి ఆకారమిచ్చి దానిని స్థిరపరిచారు: దానిని శూన్యంగా సృష్టించలేదు కాని, నివాస స్థలంగా దానిని చేశారు. ఆయన అంటున్నారు: “యెహోవాను నేనే మరి వేరే ఎవరూ లేరు.