Isaiah 47:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“కల్దీయుల కుమారీ, కన్యకా మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో. ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు. ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని, అందగత్తె అని పిలువరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో. కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“కన్యయైన బబులోను కుమార్తె, క్రిందికి దిగి ధూళిలో కూర్చో; బబులోనీయుల రాణి పట్టణమా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నీవు సున్నితమైన దానవని సుకుమారివని ఇకపై పిలువబడవు.