Isaiah 49:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు నీవునేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు నీలో నీవు అనుకొంటావు, ‘ఈ పిల్లలందర్నీ నాకు ఎవరు ఇచ్చారు? ఇది చాలా బాగుంది. నేను విచారంగా, ఒంటరిగా ఉన్నాను. నేను ఓడించబడి, నా ప్రజలకు దూరమయ్యాను. అందుచేత ఈ పిల్లలను నాకిచ్చింది ఎవరు? చూడు, నేను ఒంటరిగా విడువబడ్డాను. ఈ పిల్లలంతా ఎక్కడనుండి వచ్చారు?’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు నీవు–నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నీవు నీ హృదయంలో, ‘వీరిని నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని; నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను. ఈ పిల్లల్ని ఎవరు పెంచారు? నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ” అని అనుకుంటావు.