Isaiah 5:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుచేతనే పాతాళము గొప్ప ఆశపెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి మరణం తన దవడలను పెద్దగా తన నోరు వెడల్పుగా తెరుస్తుంది. అందులోకి యెరూషలేము సంస్థానాధిపతులు, సామాన్య ప్రజలు, ఆకతాయిలు, ఆనందించేవారు దిగిపోతారు.