Isaiah 52:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించు చున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యెహోవా వాక్కు దినమెల్ల నా నామము దూషింపబడుచున్నది
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు. వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు రోజంతా నా నామం దూషించబడుతుంది” అని యెహోవా అంటున్నారు.