Isaiah 55:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టాలి. వారు తమ దురాలోచనలు నిలిపివేయాలి. వారు తిరిగి యెహోవా దగ్గరకు రావాలి. అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు. మన దేవుడు క్షమిస్తాడు గనుక ఆ మనుష్యులు యెహోవా దగ్గరకు రావాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెనువారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడునువారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.