Isaiah 58:8 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వీటిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబడిస్తుంది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది; అప్పుడు మీ నీతి మీ ముందుగా నడుస్తుంది యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.