Isaiah 59:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
శాంతవర్తనమును వారెరుగరువారి నడవడులలో న్యాయము కనబడదువారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సమాధాన మార్గం వారికి తెలియదు; వారి మార్గాల్లో న్యాయం ఉండదు. వాటిని వారు వంకర దారులుగా చేశారు; వాటిలో నడిచే వారెవరికి సమాధానం ఉండదు.