Isaiah 60:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి. రాత్రిగాని పగలుగాని అవి మూయబడవు. రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసుకొని వస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లువారి రాజులు జయోత్సవముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంటాయి.