Isaiah 60:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి. దేవదారు, సరళ, గొంజి వృక్షాలను ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు. నా పరిశుద్ధ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు. (ఈ స్థలం నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది. నేను దానికి చాలా ఘనత ఇస్తాను.)
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షములును సరళవృక్షములును గొంజిచెట్లును నీయొద్దకు తేబడును నేను నా పాదస్థలమును మహిమపరచెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు. నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.