Isaiah 60:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గతంలో ప్రజలు నిన్ను బాధించారు. ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు. గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు. ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు. ‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నిన్ను బాధించినవారి పిల్లలు నీ ఎదుటకు వచ్చి నమస్కరిస్తారు. నిన్ను తృణీకరించిన వారందరు వచ్చి నీ పాదాల దగ్గర మోకరిస్తారు, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క సీయోనని వారు నిన్ను పిలుస్తారు.