Isaiah 60:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ కొరకు కేదారు గొఱ్ఱమందలన్నియు కూడుకొనును? నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి. నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబ డతాయి. అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన బలి అర్పణలవుతాయి. ఆశ్చర్యకరమైన నా ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ కొరకు కేదారు గొఱ్ఱెమందలన్నియు కూడుకొనును నెబాయోతు పొట్లేళ్లు నీ పరిచర్యకు ఉపయోగము లగును అవి నా బలిపీఠముమీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ దగ్గర కేదారు గొర్రె మందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్టేళ్లు నీకు సేవ చేస్తాయి; అవి నా బలిపీఠం మీద అర్పణలుగా అంగీకరించబడతాయి. నేను నా మహిమగల మందిరాన్ని అలంకరిస్తాను.