Isaiah 62:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు” “విమోచించబడిన యెహోవా ప్రజలు” అని పిలువబడతారు. “దేవుడు కోరే పట్టణం” “దేవుడు తోడుగా ఉన్న పట్టణం” అని యెరూషలేము పిలువబడుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పరిశుద్ధప్రజలనియు యెహోవా విమోచించిన వార నియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగినదానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు పరిశుద్ధ ప్రజలని, యెహోవా విడిపించినవారని పిలువబడతారు; నీవు అందరికి కావలసిన దానివని పాడుబడని పట్టణమని పిలువబడతావు.