Jeremiah 11:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమపితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా మాటలు వినడానికి నిరాకరించిన తమ పూర్వికుల పాపాలకు వారు తిరిగి వచ్చారు. వారికి సేవ చేసేందుకు ఇతర దేవుళ్ళను అనుసరించారు. ఇశ్రాయేలు యూదా వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను ఉల్లంఘించారు.