Jeremiah 12:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయు చున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు. నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు. నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు. వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా నీవు వారిని నమ్మవద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా, నీకు నమ్మకద్రోహం చేశారు; వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు. కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా వారిని నమ్మవద్దు.