Jeremiah 14:19 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? మేము స్వస్థత పొందలేనంతగా మమ్మల్ని ఎందుకు బాధించారు? మేము సమాధానం కోసం నిరీక్షించాం కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం కానీ కేవలం భయమే ఉండింది.