Jeremiah 14:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి! కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే. అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరు ఇశ్రాయేలీయులకు నిరీక్షణ, ఆపద సమయంలో వారికి రక్షకుడవు, దేశంలో నీవు అపరిచితునిలా ఎందుకు ఉన్నావు? ఒక రాత్రి మాత్రమే బసచేసే ప్రయాణికునిలా ఎందుకు ఉన్నావు?