Jeremiah 15:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుతున్నాను. నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది. నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ మాటలు దొరికినప్పుడు ఒకడు ఆహారం తిన్నట్లుగా నేను వాటిని తిన్నాను; అవే నాకు ఆనందం నా హృదయానికి సంతోషం, ఎందుకంటే సైన్యాల యెహోవా దేవుడు అనే, మీ పేరును నేను కలిగి ఉన్నాను.