Jeremiah 17:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రాయేలు నకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశాజ్యోతివి. దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు! ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి గురవుతారు. వారు అవమానించబడుతారు. జీవిత ప్రమాణం తగ్గిపోతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ; మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు. మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే, ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన యెహోవాను విడిచిపెట్టారు.