Jeremiah 17:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దావీదు సింహాసనమందు ఆసీనులై, రథముల మీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూష లేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశిం తురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“‘మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. ఆ రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు సింహాసనమందు ఆసీనులై, రథములమీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూషలేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది.