Jeremiah 17:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మ ములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరు లను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వారములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే మీరు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”