Jeremiah 18:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు. వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు. నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు. వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు. నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు. గతుకుల బాటలపై నడుస్తారు. కాని వారు మంచి మార్గంపై నన్ననుసరించరు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు; పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు, వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి, సరిగా లేని అడ్డదారుల్లో నడవాలి అనుకున్నారు.