Jeremiah 18:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారి కుమారులను క్షామమునకు అప్ప గింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవ రాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి ¸°వ నులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి. వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక! వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక! యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక! వారి భార్యలను వితంతువులుగా చేయి. వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి; ఖడ్గానికి వారిని అప్పగించండి. వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి; వారి మనుష్యులు చంపబడాలి, వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి.