Jeremiah 2:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొన కుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవుఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి. ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు. కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను! నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను. నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్తపడుము అని నేను చెప్పినను నీవు–ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు, నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు. అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు! మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము, మేము వారి వెంట వెళ్లాలి.’