Jeremiah 2:31 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి. “ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా? వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా? ‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది. యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు. కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఈ తరమువారలారా, యెహోవా సెలవిచ్చుమాట లక్ష్యపెట్టుడి–నేను ఇశ్రాయేలునకు అరణ్యమువలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతిమి; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఈ తరం వారలారా! యెహోవా మాటలు శ్రద్ధగా వినండి: “నేను ఇశ్రాయేలుకు ఎడారిగా మహా చీకటి దేశంగా ఉన్నానా? ఎందుకు నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాము; ఇకపై మేము మీ దగ్గరకు రాము’ అని ఎందుకు అంటున్నారు?