Jeremiah 20:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడునీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచు చుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసి కొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబులోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబులోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపెట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను నిన్ను నీకు, నీ స్నేహితులందరికీ భయంగా చేస్తాను; వారు తమ శత్రువుల ఖడ్గం చేత పడిపోవుట నీ కళ్లతో చూస్తావు. నేను యూదా ప్రజలందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని బబులోనుకు తీసుకెళ్తాడు, ఖడ్గంతో హతమారుస్తాడు.