Jeremiah 21:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి. నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము. నీవది చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం ఎవ్వరూ ఆపలేని దహించు అగ్నిలా ఉంటుంది. మీరు దుష్ట కార్యాలు చేశారు గనుక ఇది జరుగుతుంది.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దావీదు ఇంటివారలారా, యెహోవా మీతో ఇలా చెప్తున్నారు: “ ‘ప్రతి ఉదయం న్యాయం చేయండి; అణచివేసే వారి చేతి నుండి దోచుకోబడిన వానిని విడిపించండి, లేకపోతే మీరు చేసిన దుర్మార్గాన్ని బట్టి నా ఉగ్రత అగ్నిలా మండుతూ ఎవరూ ఆర్పలేనంతగా మిమ్మల్ని కాల్చివేస్తుంది.