Jeremiah 21:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా వాక్కు ఇదేలోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువార లారా,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను. నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు. యెరూషలేము వాసులారా ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.” కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా వాక్కు ఇదే–లోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, —మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువారలారా,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెరూషలేమా, లోయకు ఎగువన రాతి పీఠభూమి మీద నివసించేదానా, “మా మీదికి ఎవరు రాగలరు? మా నివాసంలోకి ఎవరు ప్రవేశించగలరు?” అని నీవు అనుకుంటున్నావు, అని యెహోవా అంటున్నారు.