Jeremiah 22:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు. యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్యంగా జరిగి పోయింది. యెహోయాకీమా, ‘దేవుని తెలుసు కొనుట’ అంటే ఏమిటి? దీనులకు దరిద్రులకు సహాయం చేయటం మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.” ఇదే యెహోవా వాక్కు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు పేదలు, అవసరతలో ఉన్న వారి పక్షంగా వాదించాడు, కాబట్టి అంతా బాగానే జరిగింది. నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.