Jeremiah 22:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడు చున్నావో వారి చేతికి, అనగా బబులోనురాజైన నెబు కద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించు చున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోయాకీనూ, నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, కల్దీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నిన్ను చంపాలనుకునే వారి చేతులకు, నీవు భయపడే బబులోను రాజైన నెబుకద్నెజరుకు, బబులోనీయుల చేతులకు నిన్ను అప్పగిస్తాను.