Jeremiah 25:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబు లోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబుకద్నెజరు బబులోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.