Jeremiah 26:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారు డగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు కిర్యత్యారీము వాడైన షెమయా కుమారుడగు ఊరియాయను ఒకడు యెహోవా నామమునుబట్టి ప్రవచించుచుండెను. అతడు యిర్మీయా చెప్పిన మాటల రీతిని యీ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
(అదే సమయంలో కిర్యత్-యారీము వాడైన షెమయా కుమారుడైన ఊరియా అనే మరొక వ్యక్తి యెహోవా నామమున ప్రవచించాడు; అతడు కూడా యిర్మీయా ప్రవచించినట్లే ఈ పట్టణానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు.