Jeremiah 26:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనుల కందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరు వాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొనినీవు మరణశిక్ష నొందక తప్పదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టుకున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పినందుకు నీవు చనిపోవలసినదే!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనులకందరికిని ప్రకటింపవలెనని యెహోవా యిర్మీయాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అతడు పలికి చాలించిన తరువాత యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని–నీవు మరణశిక్ష నొందక తప్పదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించినవన్నీ యిర్మీయా ప్రజలందరికి చెప్పడం ముగించిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ అతన్ని పట్టుకుని, “నీవు తప్పక చావాల్సిందే!