Jeremiah 26:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలె నగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రక టించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మంది రములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా పేరట అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా నామమునుబట్టి ఈ మందిరము షిలోహువలెనగుననియు, ఈ పట్టణము నివాసిలేక పాడైపోవుననియు నీవేల ప్రకటించుచున్నావు అనుచు, ప్రజలందరు యెహోవా మందిరములో యిర్మీయాయొద్దకు కూడివచ్చిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ మందిరం షిలోహులా అవుతుందని, ఈ పట్టణం నిర్జనమై ఎడారిగా అవుతుందని నీవు యెహోవా నామంలో ఎందుకు ప్రవచిస్తున్నావు?” అని అంటూ ప్రజలంతా యిర్మీయా యెహోవా మందిరంలో ఉండగానే అతని చుట్టూ గుమిగూడారు.