Jeremiah 29:23 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
చెర పట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబు లోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చెరపట్టబడి బబులోనులోనున్న యూదావారందరును బబులోనురాజు అగ్నిలో కాల్చిన సిద్కియావలెను అహాబువలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకొందురు; ఇదే యెహోవా వాక్కు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే వారు ఇశ్రాయేలులో అవమానకరమైన పనులు చేశారు; వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు, నేను ప్రకటించని విషయాలలో వారు నా పేరిట అబద్ధాలు చెప్పారు. అది నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని” అని యెహోవా తెలియజేస్తున్నారు.