Jeremiah 3:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యమునుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మనం సిగ్గుతో తలవంచుకుందాం. మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి. మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం. మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము. మన చిన్నతనం నుండి ఇప్పటివరకు యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సిగ్గునొందినవారమై సాగిలపడుదము రండి, మనము కనబడకుండ అవమానము మనలను మరుగుచేయును గాక; మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులును మన బాల్యము నుండి నేటివరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినవారము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మనం అవమానంలో పడి ఉందాం, మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము. మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము, మనమూ, మన పూర్వికులు; మా యవ్వనం నుండి నేటి వరకు మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు.”