Jeremiah 30:16 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నిన్ను మింగువారందరు మింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్ప కుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు! ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నారు. కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు. ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు. అలాగే యితరులు యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిన్ను మ్రింగువారందరు మ్రింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.