Jeremiah 31:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడిఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి! ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి. ‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ సర్వోన్నతుడే తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు. గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి–ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“జనులారా, యెహోవా మాట వినండి; సుదూర తీరప్రాంతాలలో ఇలా ప్రకటించండి: ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవారే వారిని సమకూర్చి, కాపరిలా తన మందను కాపాడతాడు.’