Jeremiah 31:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుట కును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గతంలో ఇశ్రాయేలు, యూదావారు చేసే కార్యకలాపాలపై నేను నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం కోసం నేను వేచి ఉన్నాను. సమయం వచ్చింది; వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని రావటానికి, వారిని బలపర్చటానికి నేను వారిని గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను వారిని పెరికివేయడానికి, కూల్చివేయడానికి, పడద్రోయడానికి, నాశనం చేయడానికి, విపత్తును రప్పించడానికి ఎలా ఎదురుచూశానో, అలాగే వారిని కట్టడానికి నాటడానికి నేను ఎదురుచూస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.