Jeremiah 32:35 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠము లను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“బెన్‌హిన్నోము లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్‍హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారికాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.