Jeremiah 34:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు కొలువుచేసిన హెబ్రీయులగు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తరువాత మీరు విడిపింపవలెను; అయితే మీపితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపక పోయిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
‘మీకు అమ్మబడిన తోటి హెబ్రీయులను ఏడవ సంవత్సరంలో మీలో ప్రతి ఒక్కరు వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత, మీరు వారిని స్వతంత్రులుగా వెళ్లిపోనివ్వాలి.’ అయితే, మీ పూర్వికులు నా మాట వినలేదు, కనీసం నా గురించి పట్టించుకోలేదు.