Jeremiah 35:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే బబులోనురాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరి యనుల దండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, మేము యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో మేము, ‘రండి, మనమంతా యెరూషలేము నగరానికి వెళదాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము దేశ (కల్దీయుల) సైన్యం నుండి మనల్ని మనం రక్షించుకుందాము’ అని అనుకున్నాము. ఆ విధంగా మేము యెరూషలేములో ఉండి పోయాము.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశములో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనులదండునకును భయపడి, మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, మేము, ‘రండి, మనం బబులోను, సిరియనుల సైన్యాల నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు వెళ్దాం’ అని చెప్పుకున్నాము. కాబట్టి మేము యెరూషలేములో ఉండిపోయాం” అని చెప్పారు.