Jeremiah 35:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, విత్తనములు నాటవద్దు. ద్రాక్షా తోటలు పెంచవద్దు. వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ దేశంలో చిరకాలం జీవించగలుగుతారు.’
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్షతోటలు నాటవద్దు; వీటిలో మీకు ఏదీ ఉండకూడదు; ఎల్లప్పుడూ గుడారాల్లో నివసించాలి. అప్పుడు మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు’ అని మాకు ఆజ్ఞాపించాడు.