Jeremiah 37:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యిర్మీయా అది అబద్దము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టు కొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధికారుల వద్దకు తీసికొని వెళ్లాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యిర్మీయా–అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అది నిజం కాదు! నేను బబులోనీయులలో చేరడానికి వెళ్లడం లేదు” అని యిర్మీయా జవాబిచ్చాడు. కాని ఇరియా అతని మాట వినలేదు; పైగా, అతడు యిర్మీయాను బంధించి అధికారుల దగ్గరకు తీసుకువచ్చాడు.