Jeremiah 37:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రాజా, నా యేలిన వాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చని పోకుండునట్లు లేఖికుడైన యెనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే నా ప్రభువా, రాజా, దయచేసి వినండి. నా విన్నపాన్ని మీ ముందుకు తేనివ్వండి: నన్ను కార్యదర్శియైన యోనాతాను ఇంటికి తిరిగి పంపవద్దు, నేను అక్కడే చనిపోతాను.”