Jeremiah 38:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకార ముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందున వారు అతనితో మాటలాడుట మానిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందునవారు అతనితో మాటలాడుట మానిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అధికారులందరూ యిర్మీయా దగ్గరకు వచ్చి అతన్ని ప్రశ్నించగా, అతడు రాజు వారితో చెప్పమని తనకు ఆదేశించినదంతా చెప్పాడు. కాబట్టి వారు అతనితో ఇంకేమి అనలేదు, ఎందుకంటే రాజుతో అతనికి ఏమి సంభాషణ జరిగిందో ఎవరూ వినలేదు.